<?xml version="1.0" encoding="UTF-8"?><song><lyrics>[C1]
   తోడు లేరని కుమిలిపోకు
   యేసే నీ తోడు ఉన్నాడు చూడు (2)
   ఓహో సోదరా యేసే నీ గురి (2) // తోడు //

[V1]
 ఆదరణ లేక అల్లాడిపోకు
 శోధన వేదనలో కృంగిపోకు (2)
 ఆదరించే వాడే యేసు
 అల్లాడిపోకు ఓ సోదరా (2) // ఓహో సోదరా //

[V2]
 విడువడు యేసు ఎడబాయడెన్నడు
 అనుక్షణము నిన్ను కాపాడును (2)
 ఆయన మీదనే భారము మోపు
 ఆయనే నిన్ను ఆదుకొంటాడు (2) // ఓహో సోదరా //</lyrics>
<title>తోడు లేరని కుమిలిపోకు</title>
<hymn_number>125</hymn_number>
</song>